విద్యతోనే సమాజాభివృద్ధి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి
రాజంపేట : విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. అన్నమాచార్య యూనవర్సిటీ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసింగించారు. మూడు దశబ్దాల కిందట నల్లరాళ ప్రాంతం ఇప్పుడు అన్నమాచార్య యూనివర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మహర్దశ కలిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యప్రదర్శనలు విద్యార్ధులను ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే ఆకేపాటి, చైర్మన్ పోలా, ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
చదువుతో పాటు సామాజిక బాధ్యత
– ఏయూ ఉత్సవాల ముగింపు సభలో
సినీనటుడు నిఖిల్ సిద్ధార్థ
రాజంపేట అన్నమాచార్య యూనవర్సిటీ విద్యాసంస్థలలో చదువుతో పాటు సామాజిక బాధ్యత, నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, విలువలను అవలంభిస్తూ ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయమని సినీనటుడు నిఖిల్ సిద్ధార్థఅన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేయరాదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేవిధంగా, ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించేలా ఇష్టపడి చదువుకోవాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషి తనను సినీరంగంలో నిలబెట్టిగలిగిందన్నారు. విద్యార్ధుల తమలోని ప్రతిభను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. లక్ష్యంపట్ల నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరన్నారు. వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వీసీ డా.సాయిబాబరెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే సమాజాభివృద్ధి


