బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
జమ్మలమడుగు : బాలికలు అన్ని రంగాల్లో రాణించడం కోసం తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా ప్రొత్సహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ముద్దనూరురోడ్డులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న 69వ జాతీయ వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని వాలీబాల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి భానుమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం 27 టీంలు వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం వాలీబాల్ క్రీడల్లో గెలిచిన పశ్చిమ బెంగాల్ టీంకు, రన్నర్‌గా వచ్చిన హార్యానా టీంకు, మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ టీంలకు షీల్డ్‌లను బహుకరించారు.
వాలీబాల్ విజేత పశ్చిమ బెంగాల్ :
జాతీయ స్థాయి వాలీబాల్ విజేతగా పశ్చిమబెంగాల్ నిలిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో గెలిపొంది క్వార్టర్ పైనల్‌కు వచ్చిన 8జట్ల మధ్య శుక్రవార సెమీఫైనల్ పోటీలను నిర్వహించారు. మొదట రాజస్థా న్–పశ్చిమ బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్ గెలుపొందింది. అదేవిధంగా హర్యానా– తమిళనాడుల మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా జట్టు గెలుపొందింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్–హర్యానా జట్లు తలపడ్డాయి.


