20న డైట్‌లో జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు
● పోటీలకు 6,7,8 తరగతుల విద్యార్థులు అర్హులు
● రంగోత్సవ్ పోస్టర్లు ఆవిష్కరణ
● డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి
రాయచోటి : ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి రంగోత్సవ్ పోటీలను జనవరి 20న రాయచోటి డైట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం డైట్ ప్రాంగణంలోని రంగోత్సవ్ పోస్టర్లను తోటి అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. రంగోత్సవ్ అనేది విద్యార్థులు తమలోని ప్రతిభను స్వేచ్ఛగా, సృజనాత్మకంగా ప్రదర్శించుకునే అద్భుతమైన వేదిక అని అన్నారు. విద్యార్థుల సహజ కళా ప్రతిభను గుర్తించి దాన్ని పెంపొందించడమే రంగోత్సవ్ ఉద్దేశ్యమన్నారు. పోటీలను ఐదు విభాగాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న 6,7,8 తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులన్నారు. ఒక విద్యార్థి ఒక పోటీలో మాత్రమే పాల్గొనాలన్నారు. పోటీలలో ప్రథమస్థాంలో నిలిచిన వారిని జనవరి 23న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు శివభాస్కర్, వైసీ రెడ్డప్పరెడ్డి, గిరిబాబు యాదవ్, తిరుపతి శ్రీనివాస్, వెంకటసుబ్బారెడ్డి, శివప్రసాద్, కలిముల్లా, మేరీ నిర్మల, ఓబుల్ రెడ్డి, యుగంధర్, ఛాత్రోపాధ్యాయులు ప్లాల్గొన్నారు.


