గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
పుంగనూరు : పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంలో పీడీ రమేష్‌రెడ్డి హౌసింగ్ సిబ్బందితో కలసి సమావేశం నిర్వహించారు. గురువారం పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల హౌసింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పీడీ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని తెలియజేశారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ దీన్‌దయాల్‌రాజు, ఏఈలు, వర్కింగ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


