● అధినేతను కలసిన అజయ్ రెడ్డి
ఉపాధి సిబ్బందికి పండుగ భారమే !
కడప సిటీ : ఉపాధి హామీ సిబ్బందికి కూటమిప్రభుత్వం వేతనాలు మంజూరు చేయకపోవడంతో పండుగ భారంగా మారబోతోందని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది ఏపీఓలు, 40 మంది ఈసీలు, 160 మంది టీఏలు, 100కు పైగా కంప్యూటర్ ఆపరేటర్లు, 619 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వాటర్‌షెడ్ సిబ్బంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. కనిష్టంగా రూ. 9 వేల నుంచి గరిష్టంగా రూ. 72 వేల వరకు వేతనాలు అందాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపితే రూ. 2 కోట్ల మేర నిధులు ప్రతినెల వేతనం కింద ప్రభుత్వం చెల్లించాలి. గతంలో ఆలస్యమైనా ఓపికతో ఉన్న సిబ్బంది అప్పో సప్పో చేసుకుని కుటుంబ పోషణ సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమీపిసున్నా జీతాలు తమ ఖాతాల్లో పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలు అందజేయాలని కోరుతున్నారు.


