కూలీల సంఖ్య పెంచకపోతే చర్యలు తప్పవు
పీడీ వెంకటరత్నం
రామసముద్రం : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచకుండా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని పీడీ వెంకటరత్నం హెచ్చరించారు గురువారం రామచంద్ర మండలం లోని ఈజీఎస్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవన్నారు. కూలీలకు పనులను కల్పించాలని, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవికమిషన్ గ్రామీణ్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం 125 రోజులు పని దినాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. నీటి సంరక్షణ, నీటి నిల్వ పనులను చేపట్టాలని ఫారంపాండ్స్, కంపోస్ట్ పిట్స్ పనులు చేపట్టాలని తెలిపారు. అనంతరం మానేవారిపల్లి అరికెల పంచాయతీలలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మానే వారి పల్లి పంచాయతీ దాసిరెడ్డిగారిపల్లి వద్ద సమస్యగా ఉన్న రోడ్డుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంపై పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. గోపాల్ రెడ్డి కొబ్బరి తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారి పల్లిలో నిర్మించిన పశువుల షెడ్డు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, జె ఈ రెడ్డిశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.


