పేద పిల్లలకు అండ.. అభినందనీయం
రాయచోటి : పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన చిన్నారులను సేవా దృక్పథంతో ఆదుకోవడంలో నిజమైన భక్తి ఉందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. గురువారం రాయచోటిలోని గుట్టపై వెలసిన అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవా సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేద పిల్లలకు ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురుస్వామి బయ్యారెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో దాతలు సమకూర్చిన నూతన వస్త్రాలను చిన్నారులకు ఎస్పీ అందజేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అర్బన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు బివి చలపతి, కుళాయప్ప, అయ్యప్ప స్వామి ట్రస్టు ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


