సోషల్ మీడియా కార్యకర్తపై దాడి హేయం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్రారెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేయడం హేయమని పార్టీ అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం కడపలోని శ్యామల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసుధ, మేయర్ పాకాసురేష్ కుమార్‌ల తో కలిసి పరామర్శించారు. దాడికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకొని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా రావాలని ఆకాంక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. తాజాగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు తరలించడంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు రామచంద్రారెడ్డిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. తమను ఎవరూ ప్రశ్నించకూడదనే ఏకై క లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ నాయకుల గొంతునొక్కుతూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు తాము అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో దాడులు చేసిన ప్రతి ఒక్కరూ ముల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు.


