ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రామాపురం : గువ్వలచెరువు తూర్పుబీటు పాలకొండ వంగిమళ్ళ రిజర్వ్ ఫారెస్టులో పాము పొడుగు రాయి వద్ద 4 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రేంజ్ ఆఫీసర్ జె మదన్‌మోహన్ ఆదేశాల మేరకు అధికారులు కూంబింగ్ చేస్తుండగా వాహనంలో ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్న నిందితులను గుర్తించారు. అధికారులు వారిని చుట్టుముట్టారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన డ్రైవర్ ఎండీ సుకూర్,తమిళనాడులోని వేలూరు చెందిన చిన్నరాజలతో సహా 4 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. దుంగల బరువు సుమారు 100 కేజీలు ఉంటుందని వాటి విలువ 50,000 వరకు ఉంటుందని రాయచోటి రేంజ్ ఆఫీసర్ జె మదన్మోహన్ అన్నారు. నిందితులను తిరుపతి రెడ్ శాండిల్ కోర్టుకు తరలించారు. దాడిలో ఎఫ్‌ఎస్‌ఓ జి.భరణికుమార్,ఎఫ్‌బిఓ కే.రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.


