నేడు బోయకొండలో హుండీ ఆదాయం లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం 7 గంటలకు హుండీ కానుకలను లెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి బ్యాంకు, ఆలయ, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు.
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సాక్షి అన్నమయ్య : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర లీగల్ సెల్ కమిటీలో... జనరల్ సెక్రటరీగా వీసీ రెడ్డెప్పరెడ్డి (రాయచోటి), సెక్రటరీగా ఎన్.శ్రీనివాస్‌రెడ్డి (రాయచోటి), జాయింట్ సెక్రటరీలుగా ఎం.గోవర్దన్‌రెడ్డి (రాజంపేట), టి.ఆనంద్ యాదవ్ (మదనపల్లె)లు నియమితులయ్యారు.
జిల్లా అనుబంధ విభాగ కమిటీలలో..
జిల్లా యూత్ వింగ్ సెక్రటరీగా యండపల్లి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ మహమ్మద్ రఫీ, జిల్లా పబ్లిసిటీ విభాగం కార్యదర్శిగా షేక్ రెడ్డి గఫార్, జిల్లా సోషల్ మీడియా విభాగ కార్యదర్శిగా మండెం రాఘవేంద్రలను నియమితులయ్యారు. వీరందరూ రాయచోటికి చెందిన వారుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురికి స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ విభాగం జోన్–5 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పుంగనూరుకు చెందిన షేక్ ఫక్రుద్ధీన్ షరీఫ్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చిత్తూరుకు చెందిన పి.రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ అధికార ప్రతినిధిగా నగరికి చెందిన బి.రవీంద్ర, రాష్ట్ర లీగల్‌సెల్ కార్యదర్శులుగా పుంగనూరుకు చెందిన కె.గోవర్దన్‌రెడ్డి, చిత్తూరుకు చెందిన ఇ.సుగుణశేఖర్‌రెడ్డి, జిల్లా ఉద్యోగులు–పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పలమనేరుకు చెందిన ఎన్.సోమచంద్రారెడ్డిను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు
ఒంటిమిట్ట : పవిత్ర ధనుర్మాసంలో భాగంగా 20వ రోజైన బుధవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా సాగాయి. రంగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీరిన సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, అభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. మూల విరాట్ దర్శనానికి వచ్చేసిన భక్తులకు ఈ మహత్కార్యాన్ని తిలకించే భాగ్యం లభించింది.
శని, ఆదివారాల్లోనూ
దరఖాస్తుల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సి బ్బంది పోస్టులను (35 ఖాళీలు) పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 10వ తేదీ రెండవ శనివారం, 11వ తేదీ ఆదివారం కూడా స్వీకరించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులయినప్పటికీ కార్యాలయ సిబ్బంది విధుల్లో కొనసాగి అభ్య ర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలని సమగ్రశిక్ష ఏపీసీ వివరించారు.
హాల్‌టికెట్లు విడుదల
రాజంపేట : రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 2027 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ప్రవేశపరీక్ష రాసేందుకు హాల్‌టికెట్లు విడుదలైనట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గంగాధరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7న ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేది నమో దు చేసి ఆన్లైన్ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. లింక్ హెచ్‌టీటీపీః//సీబీఎస్‌ఈఐటీఎంఎస్.ఆర్‌సీఐఎల్.జీఓవీ.ఇన్/ఎన్‌వీఎస్/ను సంప్రదించాలని సూచించారు.


