పిల్లలకు తప్పిన ఎండ కష్టాలు
చౌడేపల్లె: మండలంలోని కోటూరు ప్రాథమికోన్నత పాఠశాల ముందు గల వరండాలో నుంచి ఎట్టకేలకు మంగళవారం ఉపాధ్యాయులు తెచ్చే బైక్‌లను పార్కింగ్ చేసే ప్రదేశాన్ని మార్చేశారు. సోమవారం సాక్షిలో ‘బైక్‌లకు వరండా... బుడతలకు ఎండ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంఈఓ కేశవరెడ్డి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు తెచ్చే బైక్‌లను వరండాలో పార్కింగ్ చేయకుండా విద్యార్థుల సౌకర్యార్థం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల తరగతి గదులు కాకుండా బయట ప్రదేశాల్లో విద్యార్థులను కూర్చోబెట్టరాదన్నారు. విద్యార్థుల సామర్థ్యం, ప్రగతి అంశాలపై చర్చించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు.
కోటూరు పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న ఎంఈఓ కేశవరెడ్డి
కోటూరు ప్రాథమికోన్నతపాఠశాల ముందుగల వరండాలోనుంచి బయట పార్కింగ్ చేసిన బైక్‌లు
పిల్లలకు తప్పిన ఎండ కష్టాలు
పిల్లలకు తప్పిన ఎండ కష్టాలు


