భాకరాపేట జెడ్పీ హైస్కూల్ తనిఖీ
సిద్దవటం: మండలంలోని భాకరాపేట జెడ్పీ హైస్కూల్‌ను విద్యాశాఖ ఆర్‌జేడీ శామ్యూల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే 6–10వ తరగతుల వరకు జరుగుతున్న ఎఫ్‌ఏ–3 పరీక్ష గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవ తరగతి వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకేశమ్మకు సూచించారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు కూడా పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


