వ్యక్తిపై దాడి
మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమన్నందుకు వ్యక్తిపై కుటుంబం మొత్తం కలిసి దాడిచేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ పద్మావతి కల్యాణమండపం వద్ద నివాసం ఉన్న చంద్రానాయక్(52) అదే ప్రాంతానికి చెందిన దేవరాజు ద్విచక్రవాహనాన్ని ఐదునెలల క్రితం రూ.30వేలకు కుదువ పెట్టుకున్నాడు. 20 రోజుల తర్వాత దేవరాజు సాయంత్రానికి తనకు డబ్బు వస్తుందని తిరిగి ఇచ్చేస్తానని బైక్ తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నగదు ఇవ్వకుండా చంద్రానాయక్ కుటుంబసభ్యులను వేధిస్తూ వచ్చాడు. ఈక్రమంలో చంద్రానాయక్ వారి ఇంటివద్దకు వెళ్లి ఇవ్వాల్సిన నగదు వెంటనే చెల్లించాలని నిలదీశాడు. దీంతో దేవరాజు, అతడి కుటుంబసభ్యులు మూకుమ్మడిగా చంద్రానాయక్‌పై దాడిచేశారు. బకెట్ తీసుకుని తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా దేవరాజు కత్తితో చంపేస్తానంటూ మీదకు రావడంతో ఇతరులు వారించి ఇంట్లో ఉంచి తాళం వేశారు. అనంతరం స్థానికులు గాయపడిన చంద్రానాయక్‌ను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


