రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి జైలు
రాయచోటి టౌన్ : రోడ్డు ప్రమాదానికి కారణమైన షేక్ హసన్‌బాషా అనే నిందితుడికి రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి సుయోధన్ రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. సంబేపల్లె పల్లె పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండల పరిధిలో 2021 డిసెంబర్‌లో ప్రైవేట్ అంబులెన్స్‌ను నడుపుతూ రోడ్డుపై బైక్‌లో వెళుతున్న మండెం మాదయ్యను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో సోమవారం రాయచోటి కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష, పాటు రూ.1000లు జరిమానా విధించారు.


