రోడ్డు ప్రమాదంలో సుమో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో సుమో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన పీలేరు శివారు ప్రాంతం వెంకటాద్రిళ్ల వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. కేవీపల్లె మండలం గోరంట్లపల్లె పంచాయతీ బెస్తపల్లెకు చెందిన పి. యల్లప్ప (45), తోపాటు అదే గ్రామానికి వెంకటరమణ, కేవీపల్లె పంచాయతీ నక్కలదిన్నెవడ్డిపల్లెకు చెందిన శేషు, అంజి నలుగురు సుమోలో పీలేరు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రాయచోటి వైపు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న లారీ వెంకటాద్రిళ్ల వద్ద సుమోను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ యల్లప్పకు కుడిచేయి పూర్తిగా తొలిగిపోయింది. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని చికిత్సనిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


