అధ్యయనోత్సవాల్లో ధనుర్మాస పారాయణం
ఒంటిమిట్ట : పవిత్ర ధనుర్మాసంలో భాగంగా 18వ రోజైన సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాల పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రంగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీరిన సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, అభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు ధనుర్మాస పారాయణం చేశారు.
కోళ్ల వ్యాన్ బోల్తా
రొంపిచెర్ల : బాయిలర్ కోళ్లను సరఫరా చేసే వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటన అనంతపురం–చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో సోమవారం జరిగింది. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన వ్యాపారి బాయిలర్ కోళ్లను వ్యాన్‌లో తిరుపతి జిల్లాలోని భాకరాపేట, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు ప్రాంతాల్లోని చికెన్ షాపులకు ఇచ్చి తిరిగి కల్లూరుకు వెళుతుండగారొంపిచెర్ల క్రాస్ రోడ్డు వద్ద అదుపు తప్పి హైవే రోడ్డు పక్కన పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 500 కోళ్లు ఉన్నాయి. వ్యాన్ డ్రైవర్ మాదిరెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్ నిద్ర మత్తులో వ్యాన్‌ను అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగ పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కారు బోల్తా: ఒకరికి గాయాలు
ములకలచెరువు : అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతికి చెందిన ఎస్. ఉస్మాన్(33) తన కుటుంబ సభ్యులతో సత్యసాయి జిల్లా కదిరిలో పెళ్లిచూపుల నిమిత్తం వెళ్తుంగా కొండకింద రైల్వే గేటు సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఉస్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు వెళ్లే ప్రయాణికులు గమనించి బాధితుడిని 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులోని కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అధ్యయనోత్సవాల్లో ధనుర్మాస పారాయణం
అధ్యయనోత్సవాల్లో ధనుర్మాస పారాయణం


