పంటపొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని పాళెం పంచాయతీలో ఉన్న కోటపల్లె,జూపల్లె గ్రామాల సమీపంలోని పంటపొలాలపై ఏనుగులు దాడి చేశాయి. సోమవారం తెల్ల వారు జామున ఏనుగులు జూపల్లె,కోటపల్లెకు చెందిన సుబ్బరామయ్య, నాగరత్నంకు చెందిన మామిడి కొమ్మలు,బోరు పైపులు తొక్కి నాశనం చేశాయి. .జూపల్లెకు చెందినదాము కొబ్బరిచెట్లను కూడా ధ్వంసం చేశాయి. ఫారెస్టు అధికారులు స్పందించి ఏనుగులు పొలాల్లోకి రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
సైకిల్‌పై ప్రపంచ యాత్ర
రామసముద్రం : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ముత్తుచలవన్ సైకిల్‌పై ప్రపంచాన్ని చుడుతున్నాడు. 2021లో సైకిల్‌పై బయలుదేరి సోమవారం రామసముద్రం చేరుకున్నాడు. ప్రపంచయాత్రికుడు నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు ఇండియాను పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 11,11,111 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ ఉమామహేశ్వరరెడ్డిని కలిశాడు. ఎనిమిది దేశాలు చుట్టి 44వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఎస్‌ఐతో పాటు అతన్ని స్థానిక విశ్వహిందూ సమ్మేళన సమితి సభ్యులు నవీన్, చలపతి, రెడ్డి, కృష్ణారెడ్డి తదితర యువకులు ముత్తు చలవన్‌ను అభినందించారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు
మదనపల్లె సిటీ : గుంటూరులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మునిగోపాలకృష్ణ హాజరయ్యారు. తాను రచించిన కవిత తెలుగు మాటల సౌందర్యం, తెలుగు గొంతు చేసే ప్రతి శబ్దం’అనే కవితను చదివి వినిపించారు.ఆయన్ను తెలుగు మహాసభల నిర్వాకుడు గజల్ శ్రీనివాసులు సన్మానించారు.
పంటపొలాలపై ఏనుగుల దాడి


