యూరియా కోసం పడిగాపులు
కేవీపల్లె : మండలంలోని జిల్లేళ్లమంద గ్రామ పంచాయతీలో పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం జిల్లేళ్లమంద రైతు సేవా కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. ఒక బస్తా యూరియా కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఫోన్లు చేస్తే కావాల్సిన వారికి ఎన్ని బస్తాలు అయినా ఇస్తున్నారని, తమకు మాత్రం ఒక బస్తా మాత్రమే ఇచ్చారని పలువురు రైతులు వాపోయారు.అధికారులు స్పందించి అవసరం మేరకు యూరియా పారదర్శకంగా పంపిణీ చేయాలని కోరారు.


