వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌కు చెందిన శ్రీరాములు(70) రోడ్డుపై అవతలివైపున ఉన్న దుకాణం వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె పట్టణంలోని రామారావుకాలనీకి చెందిన రామప్ప కుమారుడు శ్రీకాంత్ పెయింట్ పనులు చేస్తుంటాడు. సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌లో రామసముద్రం వెళ్లి తిరిగి వస్తుండగా, కట్టుబావి వద్ద వాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వాల్మీకిపురం మండలం జరావారిపల్లెకు చెందిన వెంకటరత్నం కుమారుడు శివ(35) బెంగళూరులో ఓలాలో పనిచేస్తాడు. తన పిల్లలను చూసేందుకు స్వగ్రామానికి వచ్చి తిరిగి బైక్‌లో బెంగళూరుకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కాశీరావుపేట వద్ద ముందు వెళుతున్న మరో ద్విచక్రవాహనదారుడు అకస్మాత్తుగా బైక్‌ను మళ్లించడంతో శివ అతడి వాహనాన్ని ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయా ఘటనల్లో గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు


