ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పని చేయాలి
రైల్వేకోడూరు అర్బన్ : పార్టీలోని ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి కమిటీల నిర్మాణంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన పథకాలు, చెప్పని పథకాలు మొదటి ఏడాదిలోనే అమలు చేసి ప్రజలకు సంక్షేమం అంటే ఏమిటో తెలియజేశారన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను, బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు పాలన పట్ల పేదలు నిరుత్సాహంగా ఉన్నారని తెలిపారు. పేదలను ఆదుకోవాలంటే జగనన్న ప్రభుత్వం తిరిగి రావాలని పేర్కొన్నారు.
టీడీపీ, జనసేన నుంచి భారీ చేరికలు
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నాయకుల సమక్షంలో బొజ్జవారిపల్లి ఉపసర్పంచ్ దాడిశెట్టి సిద్దూరాయల్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన 50 కుటుంబాల వారు గోపాల్, నాగయ్య, మల్లికార్జున, రామాంజనేయులు, రవి, వెంకటేష్, మణి, హేమంత్, ఆది, రామయ్య, శివ, డేరంగుల అప్పయ్య, సుబ్బు, శివయ్య తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్లు వజ్రం భాస్కర్‌రెడ్డి, దేవనాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, తోట శివసాయి, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, మారెళ్ల రాజేశ్వరి, భరత్‌కుమార్‌రెడ్డి, సిద్దయ్య, నందాబాల, ముస్తాక్, డీవీ రమణ, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి


