ఎస్పీ కార్యాలయం పరిశీలన
మదనపల్లె రూరల్: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేయనున్న ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్ ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న రేస్ కాలేజీలో జరుగుతున్న పనులను, పెరేడ్ మైదానాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి తనిఖీ చేశారు. సత్వరమే పనులు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేంద్ర, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మదనపల్లె రూరల్: ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమ వారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని మదనపల్లెతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులు జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని తెలిపారు. అర్జీదారులు జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకోవచ్చన్నారు. అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చన్నారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన వారు అమ్మవారికి బంగారు, వెండి, చీరసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం.
పెద్దమండ్యం: మండలంలోని కలిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం మీనానాగలక్ష్మి ఆదివారం తెలిపారు. పాపేపల్లె గ్రామం గుడిశవారిపల్లెకు చెందిన రెడ్డిబాషా కుమారుడు హసేన్ కలిచెర్ల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.గత నెల 4న మదనపలె లో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ అండర్–16 పోటీలో విజేతగా నిలిచాడు. దీంతో జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు హసేన్ ఎంపికై నట్లు హెచ్‌ఎం తెలిపారు.విద్యార్థిని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
మదనపల్లె రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబర్ 8977716661 కు కాల్‌చేసి సమస్యలను సీఎండీకి తెలియజేయవచ్చని తెలిపారు.
సర్కిల్ స్థాయిలో డయల్ యువర్ ఎస్‌ఈ...
ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం జరుగుతుందని సీఎండీ తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజినీర్ దృష్టికి తీసుకొచ్చేందుకు వినియోగదారులు 94408 17449, కడప..08562 242457 నంబర్లకు కాల్ చేయాలన్నారు.
ఎస్పీ కార్యాలయం పరిశీలన


