కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు
రాజంపేట: కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకి మూలస్తంభాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. ఆదివారం రాజంపేట–రాయచోటి రహదారిలోని జీఎంసీ కల్యాణమండపంలో నియోజకవర్గ విస్తృత సంస్థాగత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కష్టపడే కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదరణ ఉంటుందన్నారు. 2029లో అధికారంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావడం తథ్యమన్నారు. అప్పుడు కార్యకర్తల మనోభీష్టం మేరకు పాలన కొనసాగుతుందని, స్వయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం శరవేగంతో పూర్తి చేసేందుకు నాయకులు సిద్ధమవ్వాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాసీ్త్రయంగా కమిటీల బలోపేతానికి పార్టీ అధిష్టానం సూచించిన నియమ, నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పంచాయతీ కమిటీ కన్వీనర్ , కమిటీల కో–ఆర్టినేటర్ వజ్రభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయినుంచి కమిటీలను బలోపేతం చేసుకుంటూ ముందుకెలుతున్నామన్నారు. కమిటీల నియామకం, ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి నియోజకవర్గం ఆదర్శంగా నిలిపేందుకు నియోజకవర్గంలోని క్యాడర్ సమష్టిగా కృషిచేయాలన్నారు. సమావేశంలో రాజంపేట అసెంబ్లీ పరిశీలకుడు దేవనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటరామిరెడ్డి, రాయలసీమజోనల్ కన్వీనర్ నరసింహ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరీరెడ్డి, పురపాలిక వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కృష్ణారావు, నియోజకవర్గంలో మండలాల కన్వీనర్లు సిద్ధవరం గోపిరెడ్డి, నీలకంఠారెడ్డి,టక్కోల శివారెడ్డి, రామస్వామిరెడ్డి, మణిరాజు, దొడ్డిపల్లె భాస్కర్‌రాజు, ఎంపీపీలు గాలివీటి రాజేంద్రనాథరెడ్డి, రమణమ్మ, సుండుపల్లె మండల ఉపాధ్యక్షురాలు రెడ్డమ్మ, బీసీనేత వడ్డెరమణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి, మహిళనేత రక్కాసి శ్రీవాణి,జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి
కమిటీల బలోపేతానికి కృషి
కష్టపడిన వారికి పెద్దపీట జగనన్న ధ్యేయం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుఆకేపాటి అమరనాథరెడ్డి
కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు


