మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు.
మదనపల్లె సిటీ: సినీరంగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. కష్టపడి ఉన్నత స్థాయి ఎదిగాను..ఇదంతా అభిమానుల ఆశీస్సులని ప్రముఖ సినీ నటి రమాప్రభ అన్నారు. ఆదివారం మదనపల్లె మండలం గంగన్నగారిపల్లెలో రమాప్రభ చేతుల మీదుగా సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆమెకు మెమెంటో అందజేసి సన్మానించారు. సూపర్‌స్టార్ కృష్ణతో నటించిన సినిమాల గురించి గుర్తు తెచ్చుకున్నారు. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ప్రముఖ సీనీ హాస్యనటులు రాజబాబు, అల్లురామలింగయ్యతో నటించిన చిత్రాల అనుభూతులు పంచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం సినిమాల్లో 800 పైగా చేశానన్నారు. ూపర్‌స్టార్ కృష్ణ అభిమాన సంఘ నాయకులు గోపికృష్ణ, హరికృష్ణ, బహదూర్‌ఖాన్, ప్రదీప్ పాల్గొన్నారు.


