డీసీసీ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌ | - | Sakshi
Sakshi News home page

డీసీసీ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌

Jan 4 2026 7:11 AM | Updated on Jan 4 2026 7:11 AM

డీసీస

డీసీసీ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌

డీసీసీ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌ ప్రారంభమైన కొత్త పాసుపుస్తకాల పంపిణీ దరఖాస్తుల స్వీకరణ జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో ప్రతిభ కస్తూర్బా పోస్టుల భర్తీకి చర్యలు

రాయచోటి జగదాంబసెంటర్‌: అన్నమయ్య జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి గాజుల భాస్కర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ నుంచి నియామక పత్రం అందింది. ఈ సందర్భంగా గాజుల భాస్కర్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోమారు అన్నమయ్య జిల్లా డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే తన ధ్యేయమని ఆయన తెలియజేశారు.

రాయచోటి: అన్నమయ్య జిల్లాలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, పీలేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న రైతులకు 64,562 పాసుపుస్తకాలను పంపిణీ చేయడానికి సిద్ధం చేసింది. రాయచోటి 21,703, మదనపల్లి 18,770, పీలేరులో 24089 మంజూరయ్యాయి. శుక్రవారం నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహిస్తూ రాజముద్రతో తయారు చేసిన కొత్తపాసుపుస్తకాలను జనవరి 9వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. నూతనంగా అందజేస్తున్న పాసుపుస్తకాలలో రైతులకు సంబంధించి సర్వే నంబర్లు, వాటి విస్తీర్ణాలలో తప్పులు ఉన్నట్లు రైతులు గగ్గోలు పెడుతున్నారు. జరిగిన తప్పులపై రైతులకు రెవెన్యూ అధికారుల నుంచి సరియైన సమాధానాలు రాకపోవడంతో.. గ్రామ సభల్లోని రైతులు చంద్రబాబు ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ నెల చివరి వారంలో రాజ్య పురస్కార్‌ , తృతీయ సోపాన్‌ (స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌) క్యాంపులు నిర్వహించనున్నట్లు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా చీఫ్‌ కమిషనర్‌ డాక్టర్‌ షేక్‌ షంషుద్దీన్‌ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెల8వ తేదీ వరకు కడప నగరం శంకరాపురంలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డీ.ఓ.సి రమణయ్య, రోహిణి, సహాయ కార్యదర్శి ఖాదర్‌ బాషా, సంయుక్త కార్యదర్శి వెంకట సుబ్బయ్యలను సంప్రదించాలని పేర్కొన్నారు.

కమలాపురం: కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్‌ కాలనీకి చెందిన చౌడం సునంద జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో విశేష ప్రతిభ చూపారు. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన 6వ సీనియర్‌ జాతీయ స్థాయి యోగాసన స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2025–26 పోటీల్లో పాల్గొన్న సునంద 35–40 ఏజ్‌ గ్రూప్‌లోని సుపైన్‌ ఆసనాల పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నారు. పలువురు భారతి పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు సునందను అభినందించారు.

రాయచోటి టౌన్‌: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నాన్‌టీచింగ్‌ ఉద్యోగాలకు తాత్కాలిక ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సర్వశిక్ష ప్రాజెక్టు అధికారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరితోపాటు పార్ట్‌ టైం టీచర్లకు కూడా దరఖాస్తులు చేసుకోవా లని కోరారు. మొత్తం పోస్టులు (కేజీబీవీ–36/ఏపీఎంఎస్‌–33)–69కు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీలోగా ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీటిలో ఒకేషనల్‌ ఇన్‌స్పె క్టర్లు కేజీబీవీ–2, కంప్యూటర్‌ ఇన్‌స్పెక్టర్లు కేజీబీవీ–10, ఏఎన్‌ఎం–7, పార్ట్‌టైం ఉపాధ్యాయులు ఏపీఎంఎస్‌–11, అటెండర్లు కేజీబీవీ–2, హెడ్‌కుక్‌ కేజీబీవీ–2, ఏపీఎంఎస్‌ 5, అసిస్టెంట్‌ కుక్‌ కేజీబీవీ–8, ఏపీఎంఎస్‌–9, నైట్‌వాచ్‌మెన్‌–1, స్కావెంజర్‌ కేజీబీవీ–3, స్వీపర్‌ కేజీబీవీ–1, చాకీబారు ఏపీఎంఎస్‌ –4, వార్డెన్‌ ఏపీఎంఎస్‌–4 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వీరిలో వార్డెన్‌ పోస్టులకు బ్యాచ్‌లర్‌లు అయిండి డిగ్రీ/ పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పార్ట్‌టైం ఉపాధ్యాయులకు బీఎస్సీ (మ్యాథ్‌మ్యాటిక్స్‌, బీఎడ్‌, ఎంఏ (ఎడ్యుకేషన్‌) కంప్యూటర్‌ కోర్సుకు డిగ్రీ పూర్తి (బీకాం/బీఎస్సీ కంప్యూటర్స్‌ )అర్హులన్నారు. వీటన్నింటికి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని వివరించారు.

డీసీసీ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌  1
1/1

డీసీసీ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement