పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మదనపల్లె సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలన్నారు. దీంతోపాటు 1వ తరగతి నుంచి 5 వతరగతి విద్యార్థుల కోసం 75 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ, డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్, పద్మావతి పాల్గొన్నారు.
ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే
ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిఫూలే అని డీఈఓ సుబ్రమణ్యం, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనురాధ అన్నారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని శనివారం డీఈఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు కరుణాకర్, డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


