వరలక్ష్మికి సౌత్ ఇండియా బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డు
కడప ఎడ్యుకేషన్: మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం జిల్లాకు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని సౌత్ ఇండియా బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి బోధనలో ఉత్తమ ప్రతిభ, సృజనాత్మకత, వృత్తి పట్ల అంకిత భావం చూపిన 5 మంది ఉపాధ్యాయినిలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా ఇందులో కడప జిల్లా పులివెందుల గవర్నమెంట్ మోడల్ ప్రైమరీ స్కూల్(రమణప్ప సత్రం)లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పీఎస్‌హెచ్‌ఎం, ఫోరమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వద్ది. వరలక్ష్మి అవార్డును అందుకున్నారు. ఇందుకు ఏపీపీఎస్ హెచ్‌ఎం ఫోరం తరపున ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ అభినందనలు తెలిపారు.


