రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
పీలేరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని వేపులబైలు పంచాయతీ జంగంపల్లె వద్ద జరిగింది. ఎస్‌ఐ లోకేష్ కథనం మేరకు.. మదనపల్లె పట్టణం పోనేటిపాళెంకు చెందిన షేక్ సయ్యద్‌బాషా (45) తన ఆటోలో పీలేరు నుంచి మదనపల్లెకు బయలుదేరాడు. పీలేరు – మదనపల్లె జాతీయ రహదారి సర్వీసురోడ్డు జంగంపల్లె వద్ద కలికిరి వైపు నుంచి వస్తున్న కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సయ్యద్‌బాషా రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కావడంతోపాటు తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


