
ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి
కలకడ : ట్రాక్టర్ అదుపు తప్పి ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. శనివారం రాత్రి కలకడ మండలంలోని రాతిగుంటపల్లె పంచాయతీ, బట్టావారిపల్లె సమీపంలోని టమాటా పంట సాగుకు వినియోగించే సీడ్స్ కర్రలను కలకడ మండలంలోని దేవులపల్లెకు తరలిస్తుండగా రాతిగుంటపల్లె పంచాయతీ లక్ష్మీపురం గ్రామం మలుపువద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దేవులపల్లెకు చెందిన వెంటరత్నం(38) అక్కడికక్కడే మృతి చెందగా, గుర్రంకొండ మండలం మర్రిమేకలవారిపల్లె దళితవాడకు చెందిన నరసింహులుకు కాలు విరిగి తీవ్ర రక్తగాయాలయ్యాయి. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కారును ఢీకొన్న
ద్విచక్ర వాహనం
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ దళితవాడ సమీపంలో ఆదివారం ఆగి ఉన్న కారును టీవీఎస్ ఎక్సెల్ ఢీకొన్న సంఘటనలో బోనంశెట్టి రవీంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు రామాపురం పోలీసులు తెలిపారు. కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న టీఎన్ 01ఏఈ 7263 నెంబర్ గల కారు గువ్వలచెరువు దళితవాడ సమీపంలో ఆగి ఉండగా వెనుకవైపు నుంచి సరస్వతిపల్లెకు చెందిన బోనంశెట్టి రవీంద్ర ఏపీ02బివి 8652 నెంబర్ గల టీవీఎస్ ఎక్సెల్‌లో వస్తూ ప్రమాదవశాత్తు కారును ఢీకొన్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్లట్లు రామాపురం పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ములకలచెరువు:గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మండలంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథ మేరకు... బురకాయలకోట పంచాయితీకి చెందిన శ్రీనివాసులు(45), రిజ్వాన్(50) లు ద్విచక్ర వాహనంలో ములకలచెరువులో జరిగిన వివాహ వేడుకకు వెళ్లారు. తిరిగి బురకాల కోటకు వస్తుండగా వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు సంఘటన స్థలంలో మృతి చెందాడు. రిజ్వాన్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒకరికి తీవ్ర గాయాలు

ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి