
మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన
వేంపల్లె : రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో కండక్టర్ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడు. ఆదివారం వేంపల్లె–రాయచోటి బస్సులో కండక్టర్ మహిళ మెడపై చెయ్యి వేసి నెట్టి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం పద అన్న తర్వాత కండక్టర్ తగ్గాడు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి డిపో బస్సులోనే ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రయాణికులు మండిపడ్డారు.
చిన్నపాటి వర్షానికి కారడం దారుణం..
వేంపల్లె – రాయచోటికి ప్రయాణించే ఆర్టీసీ బస్సు చాలా దారుణంగా ఉందని ప్రయాణికులు మండిపడ్డారు. ఆదివారం రాయచోటి డిపోకు చెందిన ఏపీ02జెడ్ 0254 నంబర్ గల ఏపీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ప్రయాణికులు మొత్తం వర్షపు నీటితో తడిచిపోయారు. వర్షం పడితే ఆ బస్సులో ప్రయాణికులు స్నానం చేసినట్లే అని వాపోతున్నారు. ఈ బస్సులో ప్రతి కిటికీకి అద్దం ఒకటే ఉంది. రాయచోటి ఆర్టీసీ డీఎం గమనించి ఇలాంటి పాతబడిన, కాలం చెల్లిన బస్సులను నడపొద్దని ప్రయాణికులు కోరుతున్నారు.

మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన