‘మిట్స్‌’ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

‘మిట్స్‌’ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

Jul 31 2025 7:20 AM | Updated on Aug 1 2025 2:38 PM

కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలోని బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు మూడేళ్ల పాటు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌ (ఎన్‌బీఎ) గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్‌ యువరాజ్‌ బుధవారం తెలిపారు. ఇది విద్యా నైపుణ్యం, నాణ్యమైన విద్య, ఫలితాల ఆధారిత అభ్యాసానికి గుర్తింపు అన్నారు. ఎన్‌బీఏ అక్రిడేషన్‌ వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాల్లో కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తాయన్నారు. ఇక్కడి డిగ్రీలకు విదేశాల్లోను గుర్తింపు ఉంటుందన్నారు. విదేశీ ఉన్నత చదువులకు కూడా అవకాశం పెరుగుతుందన్నారు.

వందశాతం పింఛన్ల పంపిణీ చేపట్టాలి: కలెక్టర్‌

రాయచోటి: జిల్లాలో ఆగస్టు ఒకటో తారీఖున వందశాతం పింఛన్ల పంపిణీని చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లో డీఆర్‌డీఏ పీడీ, మున్సిపల్‌ కమిషనర్లు, డీపిఓ, ఎంపీడీవోలు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆగస్టు 1న జరగబోయే పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై సమీక్షించారు. పింఛను పంపిణీ చేసేవారు లబ్ధిదారులతో గౌరవంగా మెలగాలని కలెక్టర్‌ సూచించారు. లబ్ధిదారులకు ముందస్తు సమాచారాన్ని టామ్‌ టామ్‌, ఇతర మాధ్యమాల ద్వారా అందించాలని, వారు ఇంటి వద్దనే ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, ఎల్డీఎం ఆంజనేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

రాజంపేట: రాజంపేట ఆర్టీసీ డిపోలో ఆన్‌కాల్‌ డ్రైవర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజరు గుండాల రమణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ఎంపికై న డ్రైవర్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు 18 నెలల అనుభవం కలిగి ఉండాలన్నారు. ప్రతి డ్రైవర్‌కు లైసెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు.మెడికల్‌ ఫిట్‌తో డ్రైవర్లను శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తయ్యాక విధుల్లోకి తీసుకుంటామన్నారు. ఆసక్తి కలిగిన డ్రైవర్లు అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌), రాజంపేట డిపోలో సంప్రందించాలన్నారు.వివరాలకు 6281612051, 7382868441 నంబర్లలో సంప్రందించాలన్నారు.

మదనపల్లె సిటీ: ఆన్‌కాల్‌ పద్ధతిపై డ్రైవర్‌ పోస్టులకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్‌ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆర్టీఓ క్లియరెన్స్‌ అర్హత సర్టిఫికెట్లతో వన్‌ డిపో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

పీలేరురూరల్‌: పీలేరు ఆర్టీసీ డిపోలో ఆన్‌కాల్‌ డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎం బి. నిర్మల తెలిపారు.ఆర్టీఓ క్లియరెన్స్‌ సర్టి ఫికెట్‌ తీసుకుని డిపో మేనేజర్‌ కార్యాలయంలో ఆఫీస్‌ వేళల్లో సంప్రదించాలని ఆమె కోరారు.

ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా ఎదగాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ది చెందాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ అధికారి ఎస్‌.సురేష్‌ అన్నారు. బుధ వారం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎన్‌ఈ మంత్రిత్వశాఖ, జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యకమం నిర్వహించారు. ఈ సందర్భంగా హబ్‌ అధికారి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ యూనిట్లను రీఎంబర్స్‌మెంట్‌ పథకాలలో నమోదు చేసుకుని లబ్ది పొందాలని సూచించారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పారిశ్రామిక సంస్థలు ముందుకు రావాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్షన్‌ నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జనార్దన్‌, పరిశ్రమలశాఖ జీఎం చాంద్‌బాష, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసమూర్తి, జా తీయ ఎస్సీ ఎస్టీ హబ్‌ సభ్యులు వసంత్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అధికారులు పాల్గొన్నారు.

‘మిట్స్‌’ కోర్సులకు  ఎన్‌బీఏ గుర్తింపు1
1/1

‘మిట్స్‌’ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement