సమస్యాత్మక ప్రాంతాల్లో కూంబింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక ప్రాంతాల్లో కూంబింగ్‌

Jun 16 2025 6:03 AM | Updated on Jun 16 2025 6:03 AM

సమస్యాత్మక ప్రాంతాల్లో కూంబింగ్‌

సమస్యాత్మక ప్రాంతాల్లో కూంబింగ్‌

సిద్దవటం: సిద్దవటం రేంజిలోని గొల్లపల్లె బీటులో కూబింగ్‌ నిర్వహించామని సిద్దవటం రేంజర్‌ కళావతి తెలిపారు. కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్‌ ఆదేశాల మేరకు సిద్దవటం ఫారెస్టు రేంజి పరిధిలోని గొల్లపల్లె, ఫారెస్ట్‌ బీట్లలోని సమస్యాత్మక , అనుమానిత ప్రదేశాల్లో తమ సిబ్బంది ఆదివారం ఎర్రచందనం అక్రమాలు జరగకుండా కూంబింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో ప్రజలకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఓబులేసు, ఫారెస్టుబీట్‌ అఫీసర్లు ఆది విశ్వనాథ్‌, మధు, పెంచల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement