భర్త మందలించాడని ఆత్మహత్య
కలకడ : భర్త మందలించాడని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ అబ్దుల్ ముజీబ్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ, తూర్పువడ్డిపల్లెకు చెందిన వెంకటరమణ తన భార్య డేరంగుల చిన్నమ్మి (60) తనకు సమయానికి అన్నం పెట్టడం లేదని 13వతేదీన మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో భర్త లేని సమయంలో పురుగుల మందు తాగింది. చుట్టుపక్కల వారు గమనించి భర్తకు సమాచారం అందజేశారు. వెంటనే తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు భర్త వెంకటరమణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


