మా జీవిత ‘మేసీ్త్ర’
విద్యార్థులకు ఉన్నత చదువు చదవాలని ఉంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంటుంది. అయితే ఆర్థిక స్తోమత లేక వారి చదువు కుంటుపడుతుంది.. అమ్మానాన్నల ఆశలు నెరవేరేవి కావు. ఇలాంటివారి కలలను సాకారం చేసింది జగనన్న అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్. పీలేరు పట్టణానికి చెందిన తాపీ మేసీ్త్ర శివప్రసాద్ జగనన్న అందించిన భరోసాను ఇలా గుర్తుచేసుకున్నాడు.
నాపేరు గుండ్లూరు శివప్రసాద్. మాది పీలేరు పట్టణం పద్మావతి నగర్. నా భార్య గుండ్లూరు రాజేశ్వరి గృహిణి. నేను తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాను. రోజంతా కష్టపడినా అరకొర ఆదాయం వస్తుంది. అది కుటుంబ పోషణకే సరిపోయేది. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. నా కూతురు జి. శ్రీరమ్య తిరు పతి చైతన్య కళాశాలలో బీటెక్ చదువుతుండేది. చదువు సాగేందుకు డబ్బుల గురించి ఆలోచించేవాడిని. అయితే అదే సమయంలో జగనన్న సీఎం కావడంతో శ్రీరమ్యకు 2022 –23, 2023–24 విద్యా సంవత్సరంలో రూ. 20 వేలు చొప్పున రెండేళ్లు మొత్తం రూ. 40 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరైంది. దీంతో ఆర్థికభారం తగ్గి నా బిడ్డ బీటెక్ పూర్తి చేసింది. పేదలను ఉన్నత చదువుల బాట పట్టించిన విద్యా ప్రదాత జగనన్న సేవలను ఎన్నటికీ మరువలేను. – పీలేరు రూరల్


