సొంతింటి కల సాకారం
నా పేరు కొలకని గంగమ్మ. ఒంటిమిట్ట మండలం అరుంధతీ వాడలో ఉంటున్నాను. నా భర్త పేరు నరసింహులు. మాకు ఒక కుమారుడు. పేరు హరిబాబు. నా భర్త మద్యానికి అలవాటు పడి ఇంటి గురించి పట్టించుకోకుండా తిరుగుతుంటాడు. ఏం చేయాలో దిక్కుతోచక మా మేనమామ పేర్ల కొండయ్య ఇంట్లో నేను, నా బిడ్డ తలదాచుకుంటున్నాము. అయి తే జగనన్న సీఎం అయ్యాక అన్ని పథకాలు మాకు అందాయి. నా కొడుకు ఒంటిమిట్టలో పదవ తరగతి చదువుకున్నాడు. అమ్మ ఒడి కింద రూ. 55 వేలు వచ్చాయి. రూ.1.50 లక్షల విలువ చేసే ఇంటిపట్టా ప్రభుత్వం ఇచ్చింది. రూ.1.80లక్షల విలువ చేసే పక్కా ఇంటి నిర్మాణం చేసుకున్నాను. చేయూత కింద రూ. 56 వేలు వచ్చింది. మొత్తం మీద రూ.4.50లక్షల వరకు ఆర్థికసాయం అందిందంటే అది జగనన్న చలువే. ప్రస్తుతం పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తున్నా. – రాజంపేట


