మా బిడ్డకు మాటొచ్చింది
జగనన్న ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించడంతో మా బిడ్డకు మాట వచ్చిందని షేక్ రేష్మా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆమె మాటల్లోనే... ‘మాది లక్కిరెడ్డిపల్లి టౌన్‌లోని పాత మసీదు వద్ద ఉంటున్నాం. నా భర్త పేరు మహబూబ్ బాషా. మాకు ఒక కుమార్తె. పేరు అలివూర్ సుల్తానా. ఆ పాపకు పుట్టుకతో మూగ, చెవుడు. అసలే ఆడబిడ్డ, అందులోనూ మూగబిడ్డ అని ఎంతో బాధపడ్డాం. లక్షలు విలువచేసే కాక్లియర్ ఇంప్లాంటే షన్ ఆపరేషన్ చేస్తేనే మాటలు వస్తాయి, చెవులు వినబడతాయని వైద్యులు చెప్పారు. నా భర్త ఆటో తోలుతూ కుటుంబం పోషిస్తున్నాడు. మాకు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించే స్థోమత లేదు. జగనన్న ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుంటూరులోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మా పాపకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇప్పడు మా పాప కొద్దికొద్దిగా మాట్లాడుతోంది. మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. – లక్కిరెడ్డిపల్లి


