ప్లాస్టిక్ నియంత్రణ అందరి బాధ్యత
కలకడ : జిల్లాను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వస్తువుల వాడకంలో నియంత్రణ ఉండాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. శనివారం కలకడలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలకడ సర్పంచ్ ప్యారీజాన్ కుమారుడు జావాద్ కలకడ చెత్తసేకరణ కేంద్రం వద్ద అధికారులతో కలిసి చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. కలకడ చెత్త సేకరణ కేంద్రం వద్ద తయారు చేసిన సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయల పంటలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కోన గ్రామానికి చెందిన చేనేత కార్మికులు ప్రదర్శించిన పట్టుచీరలను పరిశీలించారు. స్థానికంగా విక్రయ స్థలాలకు వినియోగదారులు వచ్చే విధంగా అవగాహన పెంచాలని సూచించారు. స్వర్ణ– ఆంధ్ర, స్వచ్ఛ–ఆంధ్ర ర్యాలీలో విద్యార్థులు , పారిశుధ్యకార్మికులు, అన్నిశాఖల అధికారులతో కలిసి కలకడ వరకూ ర్యాలీ నిర్వహించి, కలకడ ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేయించి పరిశుభ్రత పాటిస్తామని, ప్లాస్టిక్ వినియోగించం అని ప్రతిజ్ఞ చేయించారు.
జీతాలు పెంచి ఆదుకోండి....
వీధులు పరిశుభ్రంగా ఉంచి రోజువారి చెత్తసేకరిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు, చెత్త సేకరణ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఇంకా పలు సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఎల్‌పీవో, సీఐ లక్ష్మన్న, తహసీల్దార్ మహేశ్వరిభాయ్, ఎంపీడీఓ భానుప్రసాద్, సింగల్‌విండో అధ్యక్షులు వెంకట్రమణనాయుడు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంత్‌కుమార్


