
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. యూరియా కొరతపై ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారి సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు అన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితులు ఉంటే, ఇప్పుడు యూరియా కొరతతో పాటు పలు సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా విత్తనాలు, ఎరువులతో సహా అన్నీ సమస్యల మాదిరిగానే ఉన్నాయి. యూరియాను రైతులకు అందించకుండా టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు వినతి పత్రాలు స్వీకరించి ఆర్డీవోలకు అందజేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయనుంది వైఎస్సార్‌సీపీ.