కూటమి ప్రభుత్వంలో కూలీలుగా విద్యార్థులు.. పవన్‌ ఏం చేస్తున్నట్లు.. | YSRCP to organise Yuvatha Poru on March 12 in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో కూలీలుగా విద్యార్థులు.. పవన్‌ ఏం చేస్తున్నట్లు..

Mar 10 2025 5:40 PM | Updated on Mar 10 2025 6:06 PM

YSRCP to organise Yuvatha Poru on March 12 in Andhra Pradesh

సాక్షి,తాడేపల్లి: ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ లేక కూలి పనులకు వెళ్తున్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? బకాయి పడిన మొత్తం ఫీజు రియింబర్స్‌మెంట్‌ని వెంటనే చెల్లించాలని వైఎస్సార్‌సీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజులు కట్టలేదని కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఫీజు కట్టలేక విద్యార్థులు కూలీలుగా మారుతున్నారు.అనంతపురంలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

అయినాసరే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అందుకే 12న పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇంతవరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. గ్రూప్-2 విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి లోకేష్ దుబాయ్ వెళ్లి క్రికెట్ చూశాడు. వైఎస్‌ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని చంద్రబాబు ప్రయివేటీకరణ చేస్తున్నారు.మెడికల్ సీట్లు వద్దని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం.

ప్రశ్నిస్తామన్న పవన్ ఏం చేస్తున్నట్లు : 
చంద్రబాబు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రూ.3900 కోట్లు ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు నెడుతున్నాయి. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా ప్రభుత్వం చెప్పటం లేదు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.

2050 మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది.బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని నిరూపించారు. జాబ్ కేలండర్ జాడే లేదు.నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు.మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారు. వైఎస్‌ జగన్ తెచ్చిన విద్యా సంస్కరణలకు చంద్రబాబు పాతర వేశారు.ఈ సమస్యల పరిష్కారం కోరుతూ 12న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తాం’అని హెచ్చరించారు. రవిచంద్ర, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement