వైఎస్‌ జగన్‌పై ఎల్లో మీడియా విష ప్రచారం: మనోహర్‌రెడ్డి | Ysrcp Manohar Reddy Fires On Chandrababu And Yellow Media | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై ఎల్లో మీడియా విష ప్రచారం: మనోహర్‌రెడ్డి

Oct 14 2026 5:05 PM | Updated on Oct 14 2026 6:00 PM

Ysrcp Manohar Reddy Fires On Chandrababu And Yellow Media

సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌పై విష ప్రచారమే చంద్రబాబు నిత్య కార్యక్రమంగా మారిందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో  మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ను తిట్టనిదే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు రోజు గడవడం లేదు.. ప్రజలు నమ్మని పాత ఆరోపణలనే మళ్లీ కొత్త కథలుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్‌ జగన్‌పై మరోసారి రాజకీయ కుట్రలకు తెరలేపారు. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కేసుల పేరుతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి వైఎస్‌ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారు. ఒక ఎఫ్‌ఐఆర్‌ను 11 కేసులుగా మార్చి వైఎస్‌ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టారు. ఏళ్ల తరబడి కేసులను సాగదీస్తూ వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారు.

‘‘కోర్టుల్లో విచారణకు వైఎస్‌ జగన్ తరఫు న్యాయవాదులు ప్రతిరోజూ హాజరవుతున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా వైఎస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారమెందుకు?. రోజువారీ విచారణ జరుగుతుండగా ఈడీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరమేంటి?. వైఎస్‌ జగన్‌పై ఈడీకి ఉన్న ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు కేసులపై ఎందుకు లేదు?’’ అంటూ  మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు.

‘‘వైఎస్‌ జగన్ కేసుల్లో అత్యుత్సాహం.. చంద్రబాబు కేసుల్లో మౌనం.. ఇదేనా ఈడీ నిష్పక్షపాతం?. సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు ఏమైంది?. స్కిల్‌ స్కామ్‌లో రూ.44 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం నిజం కాదా?. ఆస్తులు జప్తు చేసిన ఈడీ.. ఆ కేసులో తదుపరి చర్యలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?. చంద్రబాబు అధికారంలోకి రాగానే స్కిల్ స్కామ్ కేసును మూసివేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీ సీఐడీ క్లోజర్ రిపోర్టు ఇస్తే ఈడీ దర్యాప్తు కూడా ఆగిపోతుందా?

..స్కిల్ స్కామ్‌ను తొలుత వెలుగులోకి తెచ్చింది జీఎస్టీ అధికారులే. జీఎస్టీ అధికారులు గుర్తించిన అక్రమాలపై ఈడీ ఏం చర్యలు తీసుకుంది?. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ వ్యవహారంలో దర్యాప్తు ఏమైంది?. రూ.2 వేల కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై వచ్చిన ఆరోపణలకు సమాధానమెక్కడ?. ఆ అనుమానాస్పద లావాదేవీల్లో డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఈడీ తేల్చిందా?. వైఎస్‌ జగన్ కేసుల్లో వేగం.. చంద్రబాబు వ్యవహారాల్లో జాప్యం.. ఎందుకీ ద్వంద్వ వైఖరి?

..కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. చట్టం అందరికీ సమానమే అయితే చంద్రబాబు కేసులపైనా అదే చురుకుదనం చూపాలి. వైఎస్‌ జగన్‌పై కేసుల పేరుతో ఎల్లో మీడియా విష ప్రచారానికి తెరలేపింది. కోర్టులో జరగని పరిణామాలను జరిగినట్లు చిత్రీకరిస్తూ బ్రేకింగ్ వార్తలు ఇస్తున్నారు. ఈడీ పిటిషన్‌ను అడ్డుపెట్టుకుని వైఎస్‌ జగన్‌పై కొత్త కథనాలు అల్లుతున్నారు. వైఎస్‌ జగన్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ఎల్లో మీడియా ప్రధాన అజెండా

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

..స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్‌ జగన్ కేసులను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ డ్రామాలు. వైఎస్‌ జగన్ ప్రజల్లోకి వస్తారంటే చంద్రబాబుకు రాజకీయ భయం పట్టుకుంటోంది. ప్రజాక్షేత్రంలో వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఆపకపోతే పరువు నష్టం దావాలు వేస్తాం.

..జర్నలిజం పేరుతో రాజకీయ కక్ష సాధింపు ప్రచారాలు చేయడం సరికాదు. దర్యాప్తు సంస్థలకు విశ్వసనీయత ముఖ్యం.. రాజకీయ ప్రయోజనాలకు వంతపాడటం కాదు. కేసులతో భయపెట్టాలని చూసినా జగన్ ప్రజల పక్షాన పోరాటం ఆపరు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్‌ జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement