సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా పైత్యం ప్రదర్శిస్తోంది. అక్రమ కేసుల్లో వ్యక్తిగత హాజరుపై ఎలాంటి కొత్త ఆదేశాలు వెలువడకపోయినా.. సీబీఐ కోర్టులో జగన్కు షాక్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగింది. అసలేం జరిగిందంటే..
జగన్పై దాఖలైన అక్రమ కేసుల్లో ఇప్పటికే రోజూవారీ విచారణలు జరుగుతున్నాయి. అయితే మళ్లీ రోజూవారీ విచారణలు చేయాలంటూ ఈడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిన్న ఈ పిటిషన్కోర్టు ముందుకు రాలేదు. రోజూవారీ విచారణ జరుగుతున్నా.. హైకోర్టుకు ఈడీ వెళ్లిందని నిన్ననే జగన్ తరపు లాయర్లు సీబీఐ కోర్టుకు గుర్తు చేశారు.
ఈ కేసులను తామే త్వరగా తేల్చాలని కోరుకుంటున్నామని వైఎస్ జగన్ తరఫు లాయర్లు పునరుద్ఘాటించారు. ఇప్పటికే రోజూవారీ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. ఈ తరుణంలో.. సీబీఐ కోర్టు ఈడీ తరఫు న్యాయవాదుల్ని పిలిచింది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. సీబీఐ సహా ఈడీ చార్జిషీట్లపై వింటామని తెలిపింది.
అయితే సీబీఐ కోర్టులో జగన్కు షాక్.. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు అంటూ ఎల్లో మీడియా వక్రీకరించి తప్పుడు కథనాలతో పైత్యం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తరఫు లాయర్లు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈడీ కేంద్రంగా కొంత కాలంగా చంద్రబాబు కుట్రా రాజకీయాలకు తెర తీశారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: నోటిఫికేషన్ ముందర ఏపీ సర్కార్కు సుప్రీం నోటీసులు


