గిద్దలూరు రూరల్: భార్యలకు భరణం చెల్లించలేకపోవడంతో ఇద్దరు వ్యక్తులకు కోర్టు జైలుశిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కేఎస్పల్లెకి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు అమీర్బాషా గిద్దలూరులోని ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వారి మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో అమీర్బాషాపై పోలీసులకు అతడి భార్య ఫిర్యాదు చేసింది.
అదేవిధంగా పట్టణంలోని చిరువ్యాపారి జి.రాజారావు కె.ఎస్.పల్లెలోని ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య, భర్తల మధ్య ఘర్షణతో రాజారావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కేసులను గిద్దలూరు కోర్టులో హాజరు పరచగా అమీర్బాషా, రాజారావు తమ భార్యలకు భరణం చెల్లించాలని లేనిపక్షంలో 30 రోజుల జైలుశిక్ష విధిస్తూ జడ్జి కె.భరత్చంద్ర తీర్పునిచ్చారు. భరణం చెల్లించలేమని చెప్పడంతో వారికి జైలు శిక్ష విధించారు.
ఇదీ చదవండి: మా పరిధి కాదు.. మేం రాం!


