రైతు పక్షాన 'వైఎస్సార్‌సీపీ' రణగర్జన | YSRCP Leaders Petition to Collector Over Farmers Facing Problems | Sakshi
Sakshi News home page

రైతు పక్షాన 'వైఎస్సార్‌సీపీ' రణగర్జన

Aug 5 2025 3:58 AM | Updated on Aug 5 2025 5:24 AM

YSRCP Leaders Petition to Collector Over Farmers Facing Problems

తిరుపతి కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

అన్నదాతలకు అండగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ పోరాటం 

యూరియా సహా ఎరువుల కొరత తీర్చాలంటూ  కదంతొక్కిన ప్రతిపక్షం 

ఎరువులు సబ్సిడీపై అందించాలని డిమాండ్‌ 

జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ 

ప్రతిచోట పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, రైతులు

సాక్షి, అమరావతి: యూరియా తీవ్ర కొరత... ఎరువులు రాయితీపై దొరకక వెత.. క్యూలైన్‌లో నిల్చోలేక వ్యథ.. పంట దెబ్బతింటోందనే బాధ... సాగుకు యాతన పడుతుంటే ఆదుకోకుండా చేతులెత్తేసిన ప్రభుత్వం... దీంతో రైతన్న కదంతొక్కాడు... వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపందుకుని ఉద్యమించాడు... సర్కారు నిర్లక్ష్యంపై ఆక్రోశం వ్యక్తం చేశాడు... రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందాల ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పణ కార్యక్రమం విజయవంతమైంది. ప్రతిచోట పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు.  

నాడు రైతే రాజు.. నేడు కష్టాల సాగు 
కలెక్టరేట్లలో వినతిపత్రాల సమర్పణ అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ... చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు అన్నదాతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతును రాజుగా చూడాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనం మొదలు పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపించిందని పేర్కొన్నా­రు. 

కానీ, చంద్రబాబు పాలనలో రైతులు ఎరువులు, పురుగు మందుల కోసం క్యూ లైన్లలో వేచి చూడాల్సి వస్తోందని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్లపైగా అనుభవం ఉందని, సంపద సృష్టించడం తెలుసని మాయమాటలు చెప్పి, ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన చంద్రబాబు, చివరకు రైతులకు సరిపడా యూరియా కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 14 నెలల కాలంలో రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటేనే వ్యవసాయ రంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేశారో తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మీకి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అర్జీ అందజేశారు. తక్షణం రైతులకు ఎరువుల సమస్యలు లేకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కోరారు. తిరుపతి కలెక్టరేట్‌లో భూమన, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు డీఆర్వో నరసింహులుకు వినతిపత్రం ఇచ్చారు. చిత్తూరులో పార్టీ నేతలు కేఆర్‌జే భరత్‌ సునీల్‌కుమార్, విజయాందరెడ్డి కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాం«దీకి వినతిపత్రం అందజేశారు.   

⇒  వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలతో కలిసి విజయవాడలో కలెక్టర్‌ జి.లక్ష్మీశను కలిసి వినతిపత్రం సమర్పించారు.  కృష్ణా జిల్లా మొవ్వలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు చుండూరు రవిబాబు, దద్దాల నారాయణ కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నాయకులు భీమవరంలోని కలెక్టరేట్‌కు తరలివెళ్లి ఇన్‌చార్జి కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఏలూరులో కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు మేకా ప్రతాప్, కంభం విజయరాజు పాల్గొన్నారు. సాగు అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందించాలని, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేకుంటే పోరుబాట తప్పదని తూర్పుగోదావరి వైఎస్సార్‌ సీపీ నాయకులు స్పష్టం చేశారు. కలెక్టర్‌ పి.ప్రశాంతికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జక్కంపూడి రాజా తదితరులు వినతిపత్రం ఇచ్చారు.  

⇒  ఎరువులు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆయన ఆధ్వర్యాన పార్టీ నేతలు వంగా గీత, తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలికి వినతిపత్రం అందజేశారు. 

⇒  రైతు సమస్యలు పరిష్కరించాలని అమలాపురంలోని కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆర్‌.మహేష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటరీ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌ పాల్గొన్నారు. 

⇒  ఖరీఫ్‌లో వస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు తీసుకుంటున్నారని శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ నా­యకులు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్ల­మెంట్‌ పరిశీలకుడు కుంభా రవిబాబు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశా­రు. విజయనగరంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌కు జెడ్పీచైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు కలెక్టరేట్‌లో వినతిపత్రాలు అందజేశారు. వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌కు, అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ జి­ల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు కలెక్టరేట్‌ రెవెన్యూభవన్‌లో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మకు  వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు కలెక్టరేట్‌లో గూడూరు, నెల్లూ­రు రూరల్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జిలు మేరిగ మురళీధర్, ఆనం విజయకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజితలతో కలిసి జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అందించినది అన్నదాత సుఖీభవ కాదని, అన్న­దాత దుః­ఖీభవ పథకమని వైఎస్సార్‌సీపీ రైతు విభా­గం అధ్యక్షుడు వై.ఆరంరెడ్డి దుయ్యబట్టా­రు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదు­ట జిల్లా రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జేసీకి వినతిపత్రం సమర్పించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement