పులివెందులలో వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Arrives in Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్‌ జగన్‌

Apr 21 2026 6:42 PM | Updated on Apr 21 2026 7:03 PM

YSRCP Chief YS Jagan Arrives in Pulivendula

కడప: మూడు రోజుల వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు చేరుకున్నారు.  వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.  నేటి నుంచి(ఏప్రిల్‌ 21వ తేదీ) మూడు రోజులపాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు(బుధవారం, ఏప్రిల్‌ 22వ తేదీ) ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డి ఇంటికి బయలుదేరి వెళతారు వైఎస్‌ జగన్‌. 

9.45గంటలకు  సుధాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి తిరగుపయనమవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement