లలితమ్మా... ఇదెక్కడి మోసమమ్మా..? | Villagers Blocked MLA Lalitha Kumari Car | Sakshi
Sakshi News home page

లలితమ్మా... ఇదెక్కడి మోసమమ్మా..?

Jan 30 2025 12:34 PM | Updated on Jan 30 2025 12:35 PM

Villagers Blocked MLA Lalitha Kumari Car

వేపాడ: ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చారు.. రోడ్డు వేస్తామని మాటిచ్చారు.. అధికారం చేపట్టి ఏడునెలలు పూర్తయినా కనీసం పట్టించుకోలేదు.. రోడ్డుపై రాకపోకలకు నరకయాతన పడుతున్నాం.. ప్రమాదాలకు గురవుతున్నాం.. వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి.. హామీ ఇచ్చి మోసం చేయడమేనా..? ఇదేనా మీ పాలన? అంటూ ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని వేపాడ

మండలం ఆతవ గ్రామస్తులు ప్రశ్నించారు. వేపాడలో జరిగిన తీర్థానికి వచ్చి తిరిగి వెళ్తున్న ఎమ్మెల్యేను బుధవారం అడ్డుకున్నారు. ప్రశ్నలు సంధించారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కారును అడ్డుకున్న మహిళలను పోలీసులు వారించారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. అధికారులుతో మాట్లాడి త్వరితగతిన రోడ్డు పనులు జరిగేలా చూస్తామంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చి పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

సీపీఎం నాయకుడు జగన్‌, బహుజన సంఘం నాయకుడు ఆతవ ఉదయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలో జెడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.అప్పారావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ వేచలపు వెంకట చినరామునాయుడు, ఎంపీపీ సత్యవంతుడు, వైస్‌ ఎంపీపీ అడపా ఈశ్వరరావు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నిరుజోగి వెంకటరావు, జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు బోజంకి రామునాయుడు, గ్రామ సర్పంచ్‌ వేమననాయుడు తదితరులు పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement