గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు | Vasireddy Padma comments on Gurjala railway halt Molestation issue | Sakshi
Sakshi News home page

గురజాల అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు

Apr 19 2022 4:13 AM | Updated on Apr 19 2022 3:04 PM

Vasireddy Padma comments on Gurjala railway halt Molestation issue - Sakshi

సాక్షి, అమరావతి: గురజాల రైల్వే హాల్ట్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను వెంటనే పట్టుకోవాలని, కేసు దర్యాప్తును ముమ్మ రం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రైల్వే పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె విజయవాడ రైల్వే ఎస్పీకి లేఖ పంపారు. కేసు నమోదు చేసిన నడికుడి రైల్వే పోలీస్‌ సీఐ శ్రీనివాసరావుతో ఆమె ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను ఆరాతీశారు.

బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు రైల్వేతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును శరవేగంగా చేధించాలని కోరారు. బాధితురాలి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆమెతోపాటు తనతో ఉన్న చంటిబిడ్డ సంరక్షణ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ చూసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement