India Book Of Records: శభాష్‌ తోషిత్‌!

Two years old boy Ranked in the India Book of Records - Sakshi

రెండేళ్లకే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం 

నూజివీడు: అపార జ్ఞాపకశక్తితో రెండేళ్ల రెండు నెలల వయస్సులోనే అబ్బురపరుస్తున్నాడు నూజివీడుకి చెందిన కలపాల తోషిత్‌రామ్‌. తన ఐక్యూతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. గతంలో ఈ రికార్డులో 2 ఏళ్ల నాలుగు నెలల వయస్సు బాలుడు ఉండగా, ఇప్పుడు తోషిత్‌రామ్‌ దాన్ని బ్రేక్‌ చేశాడు. ఇంగ్లిష్ లో ఏ నుంచి జడ్‌ వరకు ఉన్న అక్షరాలు, 12 నెలలు, ఒకటి నుంచి 21 వరకు అంకెలు ఇంగ్లిష్ లో, ఒకటి నుంచి 33 వరకు హిందీలో, ఒకటి నుంచి 10 వరకు తెలుగులో, 20 పెంపుడు జంతువులను గుర్తించి వాటి పేర్లు చెప్పడం, 20 వన్య మృగాల పేర్లు చెప్పడం, 15 పక్షుల పేర్లు, 15 పండ్ల పేర్లు, ఐదు కూరగాయల పేర్లు, 14 రకాల వాహనాల పేర్లు, ఐదు జాతీయ గుర్తుల పేర్లు, 16 శరీర భాగాల పేర్లు, ఆరు ఆకారాలు, 11 రంగుల పేర్లు, ఐదు జంతువుల శబ్దాలు, 15 యాక్షన్‌ పదాలు చెప్పి ఈ ఘనతను సాధించాడు.

బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్‌ ప్రసాద్‌ ఏపీ అసెంబ్లీలో మెంబర్‌ సర్వీస్‌ సెక్షన్‌లో లైజనింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తల్లి అట్లూరి భవ్యశ్రీ ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. తోషిత్‌ ప్రతిభ గురించి ఫిబ్రవరిలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారికి తెలియపర్చగా, మార్చిలో పరీక్షించి, రెండురోజుల కిందట సర్టిఫికెట్, మెడల్‌ పంపారని వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top