
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.

ఏపీజే అబ్దుల్ కలాంకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశభక్తుడు ఏపిజే అబ్దుల్ కలాం. ఆయన మాటలు దేశ యువతకు స్ఫూర్తిదాయకం. దేశ పటిష్టత, అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
