భూమా కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి చెక్ | SV Jagan Mohan Reddy Elected As Vijaya Dairy Chairman | Sakshi
Sakshi News home page

భూమా కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి చెక్

Jan 28 2021 3:34 AM | Updated on Jan 28 2021 8:02 AM

SV Jagan Mohan Reddy Elected As Vijaya Dairy Chairman - Sakshi

సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి 25 సంవత్సరాలుగా చైర్మన్‌గా కొనసాగుతున్నారు. భూమా కుటుంబ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. బుధవారం నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులయిన ముగ్గురు డైరెక్టర్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు నలుగురు.. వైఎస్సార్‌సీపీ మద్దతు దారుడు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో విజయ పాల డెయిరీ చైర్మన్‌గా ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికైనట్లు డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి ప్రకటించారు. 

చదవండి: (మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్‌ కేసు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement