అమ్మా .. ఎందుకిలా చేశావ్‌..

Suicide Attempt By Mother Including Children In East Godavari - Sakshi

బిడ్డలతోపాటు తానూ విషద్రవం తాగిన తల్లి

కుమార్తె మృతి, తల్లీకొడుకుల పరిస్థితి విషమం

అల్లవరం: ఆ తల్లికి చెప్పుకోలేని కష్టం ఏమోచ్చిందో పాపం. తొమ్మిది నెలలు కనిపెంచిన పిల్లలతో సహ తనువు చాలించాలనుకుంది. తనతో పాటు బిడ్డలకు చావే పరిష్కారం అనుకున్నదేమో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు పాలలో పురుగు మందు కలిపి ఇచ్చింది. తర్వాత తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన అల్లవరం మండలం ఓడలరేవులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓడలరేవు గ్రామానికి చెందిన పెచ్చెట్టి సతీష్‌ మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం ప్రాంతానికి చెందిన మాధవిని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

వీరికి మొదటి సంతానం బాబు, రెండో సంతానంగా పాపు పుట్టారు. సతీష్‌  ఓడలరేవు ఓఎన్జీసీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. వివాదాలు పడుతున్నట్లు తెలిసింది.  ఈ కలహాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం భర్త, అత్త, మామ ఇంటిలో లేని సమయంలో మాధవి (31), కుమారుడు పెచ్చెట్టి రోహిత్‌(7), పెచ్చెట్టి హరిణితో పాలలో పురుగు మందు కలిపి తాగించింది.

తర్వాత ఆమె కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురినీ ఇరుగు పొరుగు వారు గుర్తించారు. వెంటనే 108 వాహనంలో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సరికి హరిణి చనిపోయింది.  మాధవి, రోహిత్‌లకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
చదవండి:
మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం 
ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top