మద్యం దుకాణాల్లో స్టాక్‌ ఆడిట్‌

Stock audit on liquor stores Andhra Pradesh - Sakshi

ఇక ప్రతి నెలా తనిఖీలు

మూడు సంస్థల ఎంపిక

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు, డిపోలలో స్టాక్‌ ఆడిట్‌ చేయాలని రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ప్రతి నెలా ఈ స్టాక్‌ ఆడిట్‌ నిర్వహిస్తారు. అందుకోసం మూడు సంస్థలను ఎంపిక చేశారు. డిపోలను ఓ సంస్థ ఆడిట్‌ చేస్తే.. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఆడిట్‌ నిర్వహిస్తాయి. బేవరేజస్‌ సంస్థల నుంచి డిపోలకు వస్తున్న నిల్వలు, అక్కడ నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అవుతున్న వాటిని సెంట్రల్‌ డిపో నుంచే ఆడిట్‌ చేస్తారు. మిగిలిన రెండు సంస్థలు రాష్ట్రంలోని 2,975 ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్లి స్టాక్‌ ఆడిట్‌ నిర్వహిస్తాయి.

ఆ దుకాణాలకు సరఫరా అవుతున్న మద్యం, అక్కడి విక్రయాలు, ఇంకా అందుబాటులో ఉన్న నిల్వలను తనిఖీ చేస్తాయి. రికార్డులను పరిశీలిస్తాయి. ఈ విధంగా మద్యం డిపోలు, దుకాణాల్లోని స్టాక్‌ ఆడిట్‌ మొత్తాన్ని పరిశీలించి విక్రయాలు సక్రమంగా సాగుతున్నాయా? అవకతవకలు జరుగుతున్నాయా? అనే విషయాలను పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. అవకతవకలను గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top